Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కార్లో వెంబడిస్తూ అజిత్ ను ఇబ్బంది పెట్టిన అభిమాని!

  • తమిళనాట అజిత్ కి విపరీతమైన క్రేజ్
  • మార్గ మధ్యంలో కారు ఆపేసిన అజిత్
  • ఆయనతో ఫోటో దిగాలనుకున్న అభిమాని
స్టార్ హీరోలకి అభిమానులు పెద్ద సంఖ్యలో వుంటారు. తమ పేరుతో కొంతమంది అభిమానులు చేసే సేవా కార్యక్రమాలు చూసి హీరోలు ఆనందిస్తుంటారు. అలాగే కొంతమంది అభిమానులు చేసే పనుల వలన అప్పుడప్పుడు ఆయా హీరోలు ఇబ్బంది పడుతుంటారు కూడా. అలా ఒక అభిమాని కారణంగా అజిత్ ఇబ్బంది పడ్డాడట.

ఇటీవల విమానాశ్రయంలో నుంచి బయటికి వచ్చిన అజిత్, తన కారులో బయలుదేరాడు. 18 కిలోమీటర్ల పాటు తమ కారును మరో కారు వెంబడిస్తూ రావడం గమనించిన అజిత్ తన కారును ఆపేశాడట. వెనక వచ్చిన కారులో నుంచి గణేశ్ అనే యువకుడు దిగడంతో, ఎందుకు వెంబడిస్తున్నావని అడిగాడట అజిత్. ఆయనకి తాను వీరాభిమానిననీ, ఎప్పటి నుంచో ఆయనతో ఫోటో దిగాలని ఉందని ఆ యువకుడు చెప్పాడట. దాంతో ఆశ్చర్యపోయిన అజిత్, ఇలాంటి ప్రమాదకరమైన పనులు ఇంకెప్పుడూ చేయవద్దని చెప్పి, ఆ యువకుడితో కలిసి ఫోటో దిగాడు. సారీ చెప్పేసిన ఆ యువకుడు సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడట.      
ajith

More Telugu News